బాలీవుడ్ నటుడు.. హీరో అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘సితారే జమీన్ పర్’. ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్‌గా నటిస్తున్నారు. అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమీర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ టైంలో ‘సితారే జమీన్ పర్’ సెట్స్‌కి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వచ్చి సందడి చేశాడు. అమీర్‌ఖాన్ ఆహ్వానం మేరకు సెట్స్‌లో సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన షారుఖ్ అక్కడి నటీనటులతో సందడి చేశాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ తాజాగా షేర్ చేసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తన దురుసు ప్రవర్తనతో సస్పెండ్ అయిన ఒక బాస్కెట్‌బాల్ కోచ్ (అమీర్‌ఖాన్) మళ్లీ తన విధుల్లో చేరాలంటే మానసిక వికలాంగులకి బాస్కెట్‌బాల్ ఆట నేర్పి ప్లేయర్స్‌గా తీర్చిదిద్దాలని కోర్టు షరతు పెడుతుంది. ఈ క్రమంలోనే ఆ కోచ్‌కి ఎదురైన సవాళ్లేంటి అనేది ఈ సినిమా.
- June 19, 2025
0
120
Less than a minute
Tags:
You can share this post!
editor

