హీరో అల్లు అర్జున్‌కి నార్త్ మార్కెట్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన ఖాన్స్ సెట్ చేసిన రికార్డులని సైతం అల్లు అర్జున్ తన పుష్ప 2 సినిమాతో భారీ మార్జిన్‌తో కొట్టి నార్త్ మార్కెట్‌లో ఏ సినిమాలు కూడా అందుకోని సంచలన రికార్డులు సెట్ చేసాడు. ఇక ఇదే హిందీ మార్కెట్‌లో పుష్పరాజ్ చేసిన మరో సంచలన రికార్డును సెట్ చేసింది. ఇండియా వైడ్‌గా ఎంతో ఎక్కువగా చూసే ఐపీఎల్ యావరేజ్ రికార్డుని సైతం పుష్ప 2 టెలికాస్ట్‌లో బద్దలుకొట్టిందట. ఐపీఎల్ 2025కి 4.6 టెలివిజన్ రేటింగ్ వస్తే పుష్ప 2 కి మొదటి ప్రీమియర్‌లో 5.1 టీవీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఐపీఎల్‌ని మించిన మ్యానియా హిందీలో బుల్లితెరపై అల్లు అర్జున్ చూపించాడని చెప్పాలి. ఇక ఇదే కాకుండా సినిమాల పరంగా కూడా అక్కడ భారీగా హిట్ అయ్యిన స్త్రీ 2 రికార్డుని కూడా పుష్ప 2 దాటేసిందట.
- June 14, 2025
0
126
Less than a minute
Tags:
You can share this post!
editor

