హీరో బాలకృష్ణ.. నటి సంయుక్తతో కలిసి ఏలూరు నగరంలో సందడి చేశారు. ఏలూరు నగరంలోని బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని ప్రారంభించిన బాలయ్య తన తాజా సినిమా అఖండ 2 గురించి కూడా మాట్లాడారు. సినిమా నిర్మాణం పూర్తి అయిందని, సినిమా చాలా బాగా వచ్చిందని తెలియజేశారు. ఇటీవలే విడుదలైన టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల అవుతుందని ఆయన వెల్లడించారు. అయితే బాలయ్యని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. కాగా ఈ సందర్భంగా బాలకృష్ణ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది సంయుక్త మీనన్. బాలయ్య ఆమెను దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు. వేరే వారితో బాలయ్య మాట్లాడుతుండగా, వెనక నుండి బాలయ్య కాళ్లు మొక్కింది సంయుక్త.. ఆ సమయంలో బాలయ్య ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఇక ఈ మధ్య బాలయ్య హవా ఏ రేంజ్‌లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, హోస్ట్‌గా అదరగొడుతున్నారు.
- June 14, 2025
0
83
Less than a minute
Tags:
You can share this post!
editor

