ఆ హీరో వ‌ల‌న మా కుటుంబం అంతా అస్తవ్యస్థమయ్యిందన్న హీరోయిన్

ఆ హీరో వ‌ల‌న మా కుటుంబం అంతా అస్తవ్యస్థమయ్యిందన్న హీరోయిన్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత రియా చ‌క్ర‌వ‌ర్తి కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. ముంబయిలోని బాంద్రాలో 2020 జూన్‌ 14న సుశాంత్‌ సింగ్‌ తన ఫ్లాట్‌లో అనుమానాస్పద రీతిలో మరణించారు. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, అది ఆత్మహత్య కాదంటూ ఆయన కుటుంబసభ్యులు నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబసభ్యులపై కేసు పెట్టారు. నిందితులు సుశాంత్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారని, అతని తండ్రి కేకే సింగ్‌ ఆరోపించడ‌తో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రియాను ప్రశ్నించింది. నటుడి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు. దాదాపు నాలుగేళ్లపాటు విచారణ కొనసాగింది. సుశాంత్‌ను ఎవరైనా ఆత్మహత్యకు ప్రేరేపించారా? అనే విషయంలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాక‌పోవ‌డంతో రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి క్లీన్‌ చిట్ ఇచ్చారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత తనతోపాటు తన తమ్ముడి కెరీర్లు ముగిశాయని నటి రియా చక్రవర్తి తెలిపారు. సుశాంత్ చనిపోయాక నాకు నటనపరంగా అవకాశాలు రాలేదు.

editor

Related Articles