తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు అభిప్రాయపడ్డారు. పర్సంటేజ్ సిస్టమ్‌లో మార్పుల కోసం పోరాడటం కంటే, ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు ఎలా రప్పించాలి అనే దానిపై దృష్టి సారించాలని ఫిల్మ్‌నగర్ పెద్దలకు ఆయన విజ్ఞప్తి చేశాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప.. ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్లకు ప్రేక్షకులు రావడం మానేస్తారు. ఈ రెండు మూడేళ్లలో చాలామంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు.
- June 6, 2025
0
56
Less than a minute
Tags:
You can share this post!
editor

