మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఆయన తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. టామ్ చాకో, ఆయన తల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన తమిళనాడు సమీపంలోని ధర్మపురిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. టామ్ చాకో తన ఫ్యామిలీతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో పాలకోట్టై సమీపంలో వీరి కారు లారీని ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో డ్రైవర్‌తోపాటు టామ్ చాకో, ఆయన తండ్రి సీపీ చాకో, తల్లి, సోదరుడు ఉన్నారు. ప్రమాదంలో టామ్ చాకో తండ్రి సీపీ చాకో ప్రాణాలు కోల్పోగా.. టామ్ చాకో, ఆయన తల్లి, సోదరుడు, కారు డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. వారు ప్రస్తుతం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
- June 6, 2025
0
68
Less than a minute
Tags:
You can share this post!
editor

