హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో హర్రర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఓ విషయంలో చాలా తగ్గించినట్లు తెలుస్తోంది. రాజాసాబ్ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా కోసం ప్రభాస్ తన రెగ్యులర్ రెమ్యునరేషన్ రూ.150 కోట్లు కాకుండా రూ.100 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడట. ఈ సినిమా కోసం ఆయన రూ.50 కోట్లు తగ్గించినట్లు తెలుస్తోంది. దీనికి కారణం కూడా ఉందని తెలుస్తోంది. గతంలో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రంతో ఈ నిర్మాత నష్టాలను చవిచూశారు. అందుకే, ఇప్పుడు ఆయన కోసం ప్రభాస్ తన రెమ్యూనరేషన్ తగ్గించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
- June 5, 2025
0
122
Less than a minute
Tags:
You can share this post!
editor

