ఒకప్పుడు టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరించిన హీరోయిన్ అనుష్క శెట్టి. 2005లో సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ హీరోయిన్ ఆ తర్వాత విక్రమార్కుడు, లక్ష్యం, డాన్, శౌర్యం, చింతకాయల రవి, కింగ్, బిల్లా, సింగం, రగడ, మిర్చి, డమరుకం, బాహుబలి, బాహుబలి 2 , మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అరుంధతి, రుద్రమ దేవి, భాగమతి, సైజ్ జీరో, నిశ్శబ్ధం తదితర లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తన సత్తా ఏంటో చూపించింది అనుష్క. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి ఫీల్ గుడ్ తర్వాత అనుష్క .. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటి అనే సినిమా చేసింది. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది. అయితే అనుష్క తన కెరీర్‌లో కొన్ని రిస్కీ పాత్రలు కూడా చేసింది. వాటిలో ఆమె వేదం సినిమాలో చేసిన వేశ్య పాత్ర ఒకటి. క్రిష్ జాగర్ల మూడి తెరకెక్కించిన వేదం సినిమా రిలీజ్ (జూన్ 04)కి 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ వేదం సినిమాకి సంబంధించిన స్పెషల్ పోస్ట్ కూడా పెట్టాడు. వేదం సినిమా తన కెరీర్‌లో ఒక విభిన్నమైన చిత్రమని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ సినిమాను ఎంతో నిజాయితీగా తీసినందుకు దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వేదం సినిమా ప్రమోషన్ కోసం అనుష్క పసుపు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ తెగ వాడేశారు. పలుచోట్ల హోర్డింగ్‌లు పెట్టారు. అయితే పంజాగుట్ట సర్కిల్‌లో కూడా అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫొటోని పెద్ద సైజులో పెట్టారట. అయితే అనుష్కని చూస్తూ వాహనదారులు యాక్సిడెంట్ల బారిన పడడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. దాదాపు 40 మైనర్ యాక్సిడెంట్స్ జరగడంతో పోలీసులు GHMC అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్‌ని తొలగించారట.
- June 5, 2025
0
130
Less than a minute
Tags:
You can share this post!
editor

