హీరో పవన్‌కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలపై కూడా ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నారు. సాధ్యమైనంత తొందరలో తన సినిమాలను పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నారు. కొద్దిరోజుల క్రితమే ఆయన ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్‌లో కీలక ఘట్టాల చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం నేటి నుండి విజయవాడలో తుది షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నారని తెలిసింది. ఈ నెల 16 వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.
- June 5, 2025
0
228
Less than a minute
Tags:
You can share this post!
editor


