కార్తీక దీపం సీరియల్‌లో మోనిత పాత్రలో, తన విలనిజంతో అందరినీ ఆకట్టుకున్న చిన్నది శోభా శెట్టి. ఈ అమ్మడికి ఫుల్ పాపులారిటీ ఉంది. బిగ్ బాస్‌కు వెళ్లిన తర్వాత శోభా శెట్టి తన పాపులారిటీ మరింత పెంచుకుంది. సీరియల్‌లో మాత్రమే కాదు బిగ్ బాస్ హౌజ్‌లోను తన విలనిజం మార్క్ చూపిస్తూ అందరిని కట్టిపడేసింది. బిగ్ బాస్ 7లో పాల్గొన్న తర్వాత శోభాశెట్టి క్రేజ్ మరింత పెరిగింది. హౌజ్ నుండి బయటకు వచ్చాక పలు సీరియల్స్, షోస్ చేస్తూ బిజీగా గడిపేస్తోంది. ఆ మధ్య కన్నడ బిగ్ బాస్ హౌజ్‌లో కూడా సందడి చేసింది. కాకపోతే అనారోగ్య సమస్యలతో ముందే బయటకు వచ్చేసింది. శోభాశెట్టి ఈ మధ్య టీవీ షోస్ తప్పితే ఏ సీరియల్ లోనూ కనిపించడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన క్యూట్ ఫొటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా ఫాలోయర్లకు బిగ్‌షాక్ ఇచ్చింది. ‘కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరం కాబోతున్నాను’ అంటూ ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ పెట్టి అందరూ షాక్ అయ్యేలా చేసింది. శోభాశెట్టి ఇటీవల కార్తీక దీపం సీరియల్ సెకండ్ హీరోతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అయితే పెళ్లిని మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉంచింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కాబోయే వాడితో కలిసి కొత్త ఇల్లు కొనుక్కుంది. మరి ఏమయ్యిందో ఇంత సడెన్‌గా సోషల్ మీడియాకి బై చెప్పడం ఏంటో తెలీడం అంటూ ఫాన్స్ అనుకుంటున్నారు.
- June 5, 2025
0
55
Less than a minute
Tags:
You can share this post!
editor

