Movie Muzz

డెకాయిట్‌ ఫైర్‌ థీమ్‌

డెకాయిట్‌ ఫైర్‌ థీమ్‌

అడివిశేష్‌ నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్‌ పాన్‌ ఇండియా థ్రిల్లర్‌ ‘డెకాయిట్‌’. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్. షానియల్‌ డియో దర్శకుడు. సుప్రియా యార్లగడ్డ నిర్మాత. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా సినిమా విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌.. ఇంటెన్స్‌ యాక్షన్‌, స్టైలిష్‌ విజవల్స్‌తో ఆకట్టుకుంటుందని, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని మేకర్స్‌ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫైర్‌ థీమ్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరిచిన ఈ థీమ్‌ ఆడియన్స్‌కి ఓ భిన్నమైన అనుభూతిని అందిస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సినిమాకి సహ నిర్మాత: సునీల్‌ నారంగ్‌, సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్‌.

editor

Related Articles