టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయం, నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇక పలు అనారోగ్య కారణాలతో ఇటీవలే సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్న సామ్.. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. వరుస పెట్టి సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. అదే సమయంలో ఈవెంట్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తోంది. తాజాగా సమంత దుబాయ్‌లో సందడి చేసింది. అక్కడ జరిగిన ఓ స్పెషల్ ఈవెంట్‌కు చాలా స్పెషల్‌గా ముస్తాబై వచ్చింది. ఎంబ్రాయిడరీ నెట్ గోల్డ్ కలర్ శారీలో మెరిసిపోయింది. సింపుల్ మేకప్, హెయి స్టైల్‌తో తన లుక్‌కు మరింత అందంగా మార్చుకని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సామ్‌ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. వారందరితో సమంత ఫొటోలు, సెల్ఫీలకు ఫోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామ్ తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ఆకట్టుకుంటున్నాయి.
- June 4, 2025
0
75
Less than a minute
Tags:
You can share this post!
editor

