Movie Muzz

విశ్వంభర సినిమా పూర్తి ఔట్‌పుట్‌ వచ్చాకే రిలీజ్‌ డేట్‌ ప్రకటిద్దామన్న చిరంజీవి

విశ్వంభర సినిమా పూర్తి ఔట్‌పుట్‌ వచ్చాకే రిలీజ్‌ డేట్‌ ప్రకటిద్దామన్న చిరంజీవి

హీరో చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా కోసం మెగా ఫ్యాన్సంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒకటి రెండు రోజుల ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీజీ వర్క్‌ జరుగుతోంది. ‘విశ్వంభర’ సినిమాని 90 శాతం ఇండోర్‌లోనే తెరకెక్కించారు దర్శకుడు మల్లిడి వశిష్ట. కథానుసారం ఈ సినిమాకు 70 శాతం సీజీ వర్కే ఉంటుంది. అందుకే.. ప్రపంచంలోనే పేరెన్నికగన్న వివిధ స్టూడియోలు ఈ సినిమా సీజీకి వర్క్‌ చేస్తున్నాయి. వాటినుండి పూర్తి ఔట్‌పుట్‌ వచ్చాకే సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించాలనేది ‘మెగా’ ఆదేశం. అందుకు నిర్మాతలు సైతం కట్టుబడి ఉన్నారని సమాచారం.

editor

Related Articles