లేడి సూపర్ స్టార్ నయనతార ఇద్దరు పిల్లలకి తల్లైన కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషలలో కూడా సినిమాలు చేస్తోంది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరు హీరోలతో కలిసి పనిచేస్తోంది. ఇప్పుడు చిరంజీవి సరసన నటిస్తోంది. ఈ సినిమాని అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. అయితే సాధారణంగా నయనతార ప్రమోషన్ కార్యక్రమాలకి చాలా దూరంగా ఉంటుంది. కాని చిరు సినిమాకి ముందు నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఆ మధ్య అనీల్ రావిపూడి చెన్నైకి వెళ్లి ఆమెతో ఓ ప్రమోషన్ వీడియో చేయించాడు. అది నెట్టింట తెగ వైరల్ అయింది. సాధారణంగా ఎంత పెద్ద హీరో సినిమా అయిన సరే నయనతార పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనదు. వారికి ముందుగానే హింట్ ఇచ్చేస్తుంది. తమిళ సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఎప్పుడు పెద్దగా పాల్గొనదు. కాని చిరు – అనీల్ రావిపూడి సినిమాకి ముందు నుండే ప్రమోషన్ మొదలు పెట్టేసరికి తమిళ సినిమాల ప్రమోషన్లలో ఏనాడూ పాల్గొనని నువ్వు తెలుగు సినిమాకి అదీ షూటింగ్ మొదలు కాకముందే ప్రమోషన్స్ చేస్తున్నావు. తెలుగు సినిమాలంటే అంత ఇష్టం ఉందా.. అయితే టాలీవుడ్‌కే షిఫ్ట్ అయిపోవచ్చు కదా అని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ట్రోలర్స్‌కి నయనతార గట్టిగా బదులు ఇచ్చింది. అనవసర విషయాలకి టైమ్ వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా వీలును బట్టి నిర్మాతలకు సహకరిస్తూనే ఉంటా. ప్రమోషన్లకి వెళ్లాలా?.. వద్దా.. అన్నది కూడా నా పర్సనల్ విషయం. ఈ విషయంలో ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని తనదైన స్టైల్‌లో రిప్లయ్ ఇచ్చింది లేడీ సూపర్‌స్టార్.
- June 3, 2025
0
135
Less than a minute
Tags:
You can share this post!
editor

