‘థగ్‌ లైఫ్‌’లో సాంగ్-విశ్వద నాయకా విహిత వీరా..

‘థగ్‌ లైఫ్‌’లో సాంగ్-విశ్వద నాయకా విహిత వీరా..

లెజెండరీ యాక్టర్‌ కమల్‌హాసన్‌, విఖ్యాత దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రానున్న పాన్‌ ఇండియా గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘థగ్‌ లైఫ్‌’. శింబు, అశోక్‌ సెల్వన్‌, త్రిష కృష్ణన్‌, అభిరామి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరకల్పనలో ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలు విడుదల కాగా, సొమవారం నాలుగో పాటను విడుదల చేశారు. ‘విశ్వద నాయకా.. విహిత వీరా.. మనసు నీకై.. రథమై రాదా..’ అంటూ సాగే ఈ పాటను అనంత శ్రీరామ్‌ రాయగా, అలెగ్జాండర్‌ జాయ్‌ ఆలపించారు. ప్రశాంత్‌ వెంకట్‌ రాసిన ర్యాప్‌ను ఎ.ఆర్‌ అమీన్‌ అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకు ఈ ర్యాప్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇందులోని కమల్‌హాసన్‌ పాత్రను ప్రజెంట్‌ చేసేలా ఈ పాట సాగింది. ఈ పాటలో కమల్‌హాసన్‌ డిఫరెంట్‌ అవతారాల్లో కనిపిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని శ్రేష్ట్‌ మూవీస్‌ ద్వారా ఎన్‌.సుధాకర్‌రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్న విషయం విదితమే.

editor

Related Articles