విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్ డ‌మ్‌ మ‌ళ్లీ పోస్ట్ పోన్ అవుతుందా?

విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్ డ‌మ్‌ మ‌ళ్లీ పోస్ట్ పోన్ అవుతుందా?

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండకి హిట్ రాక చాలారోజులు అవుతోంది. ఎలాంటి సినిమా చేసిన కూడా ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డుతోంది. అయితే ఈసారి హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు విజ‌య్. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న కింగ్‌డ‌మ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆ మధ్య ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో వచ్చిన టీజర్, రీసెంట్‌గా వచ్చిన పాట సినిమాపై అంచనాలను పెంచింది. జులై 4న సినిమాని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కాని సినిమా వాయిదా ప‌డే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న కింగ్‌డమ్ విడుదల తేదీ ద‌గ్గ‌ర‌పడుతోంది. అయితే ఇటీవలే ఫైనల్ కట్ చూసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాలని భావించడంతో ఇప్పుడు రీషూట్ గోవాలో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాలేదు కాని దీనిమీద వర్క్ జరుగుతోందట. ఇది కాగానే బ్యాలన్స్ ఉన్న పోస్ట్ ప్రొడక్షన్‌ని ఫినిష్ చేసి అనిరుధ్ రవిచందర్ రీ రికార్డింగ్ కోసం ఫైనల్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. స‌మ‌యం లేక‌పోవ‌డంతో టీమ్ ప‌రుగులు పెట్టాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రి చెప్పిన టైంకి సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారా, లేదంటే పోస్ట్ పోన్ చేస్తారా అన్న‌ది తెలియాల్సి ఉంది.

editor

Related Articles