పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 12న, 2025న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో, ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్ పైనే ఉంది. అందరూ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, కానీ సినిమా రెండవ భాగంలో విస్తృతమైన సిజి పని కారణంగా ట్రైలర్ రిలీజ్ ఆలస్యం అయిందని, త్వరలో ట్రైలర్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంటుందని, అధికారికంగా విడుదల తేదీని కూడా ముందుగానే ప్రకటిస్తాం అని ఈ చిత్ర నిర్మాత ఎ. ఎం. రత్నం తెలిపారు. అన్నట్టు డైరెక్టర్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
- June 2, 2025
0
56
Less than a minute
Tags:
You can share this post!
editor

