జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డికి కాస్త దైవ చింతన ఎక్కువే. పలు సందర్భాలలో గుళ్లకి వెళ్లి పూజలు చేస్తుంది. వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. మరోవైపు గతంలో పలుసార్లు వేణు స్వామిని కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అయితే ఈసారి ప్రముఖ కామాఖ్య ఆలయంలో అషూ రెడ్డి పూజలు చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. సెలబ్రిటీలకు జాతకాలు చెబుతోన్న వేణుస్వామి వారికి ఏమైనా దోషాలు ఉంటే పరిహారంగా పూజలు నిర్వహిస్తుంటారు. ఆయన దగ్గర టాప్ హీరోయిన్స్ కూడా పూజలు చేయించుకున్నారు. తాజాగా అస్సాంలోని ప్రముఖ కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్న అషూ రెడ్డి అక్కడ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి ఇప్పుడు వైరల్గా మారాయి.
- June 2, 2025
0
74
Less than a minute
Tags:
You can share this post!
editor

