బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 22 సంవత్సరాలు అయినా.. ఇప్పటికీ తనదైన అభినయంతో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటూ వస్తోంది. హిందీతో పాటు బెంగాలీ, మలయాళం, తమిళ భాషల్లోనూ తన ప్రతిభను చాటిన ఆమె.. 2019లో తెలుగు సినీరంగంలోకి ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘జటాధర’ అనే సినిమాలో ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. హీరో రజనీకాంత్‌తో ఓ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కెరీర్ పరంగా బిజీగా ఉండే విద్యా బాలన్ తన అభిప్రాయాలను కూడా నిర్భయంగా వ్యక్తపరుస్తూ వస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. సినీ పరిశ్రమలో మార్పులు అనివార్యమని, కాలానుగుణంగా నటీనటులూ మారాలని ఆమె సూచించారు. ముఖ్యంగా హీరోయిన్లు అవకాశాలను బట్టి తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఉండాలి అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
- June 2, 2025
0
124
Less than a minute
Tags:
You can share this post!
editor


