క‌న్నుమూసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు.. సంతాపం తెలిపిన ప్ర‌ముఖులు

క‌న్నుమూసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు.. సంతాపం తెలిపిన ప్ర‌ముఖులు

ఈ మ‌ధ్య సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన విషాద వార్త‌లు ఎక్కువ‌గా వింటున్నాం. కొంద‌రు ప్ర‌ముఖులు అనారోగ్యంతో క‌న్నుమూస్తుండ‌డం అభిమానుల‌ని తీవ్ర ఆందోళ‌న‌కి గురి చేస్తోంది. తాజాగా కోలీవుడ్ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయ‌న‌ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ తెర‌కెక్కించ‌కుండానే కన్నుమూయ‌డం బాధిస్తోంది. విక్రమ్ సుకుమారన్ తన కెరీర్ ప్రారంభంలో బాలు మహేంద్ర, వెట్రిమారన్ వంటి వారి వద్ద అసిస్టెంట్‌గా పని చేశారు. వెట్రిమారన్ తీసిన ఆడుకాలం సినిమాకి హార్డ్ వ‌ర్క్ చేశారు విక్ర‌మ్. అతని వ‌ల్లే ఆడుకాలం సినిమా హిట్ అయింద‌ని వెట్రిమార‌న్ ప‌లు సంద‌ర్భాల‌లో చెప్పుకొచ్చిన విష‌యం విదిత‌మే. ఇక విక్ర‌మ్.. శంతునుతో మద యానై కొట్టం, రావణ కొట్టం వంటి చిత్రాలు తీసి ఎంత‌గానో అల‌రించారు. ఇక సూరితో ఓ ప్రాజెక్ట్ అనుకోగా, అది త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఆ క‌ల నెర‌వేర‌కుండానే ఇంత తొంద‌ర‌గా క‌న్నుమూయ‌డంతో ఆయ‌న స‌న్నిహితులు కన్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా సంతాపం వ్య‌క్తం చేస్తూ.. ఇంత త్వ‌ర‌గా వెళ్లిపోయావు.. ఆయ‌న చెప్పాల్సిన క‌థ‌లు ఎన్నో మ‌రుగున ప‌డిన‌ట్టే అని ట్వీట్ చేశాడు.

editor

Related Articles