కమెడియన్ అలీ.. మెగా ఫ్యామిలీతో చాలా స్నేహంగా ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో అలీ ఫ్రెండ్‌షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలీ, పవన్ కళ్యాణ్‌లు బెస్ట్ ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ సినిమాల్లో దాదాపు అలీ ఉండాల్సిందే. పవన్ సినిమా అంటే అలీ కోసం ఒక క్యారెక్టర్ ప్రత్యేకించి రాసేవారంటే వీళ్లిద్దరి బాండింగ్ ఏ రేంజ్‌లో ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. అయితే పవన్ రాజకీయాలలో వెళ్లినప్పటి నుండి వీరి బాండింగ్‌కి కాస్త బీటలు వారాయి. అలీ పవన్ కళ్యాణ్‌ని కాదని.. ప్రత్యర్థి పార్టీలో చేరి.. జనసేన పార్టీపై విమర్శలు గుప్పిచడంతో కొంత రిలేషన్‌షిప్ దెబ్బతింది. అయితే అలీ కొద్ది రోజుల క్రితం రాజకీయాలకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అయితే అలీకి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక బహుమతి పంపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలీ.. పవన్ కళ్యాణ్‌తోనే కాకుండా చిరంజీవితోను సన్నిహితంగా ఉంటారు. వారిద్దరు కలిసి చాలా చిత్రాలలో నటించి మెప్పించారు. కొన్ని సందర్భాలలో అలీ.. చిరంజీవిపై తనకున్న అనుబంధాన్ని కూడా చాటుకున్నారు. ఈ నేపథ్యంలో హీరో చిరంజీవి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తన తోటలో పండిన మామిడి పండ్లను ప్రత్యేకంగా ప్యాక్ చేసి పంపారు. అయితే, ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. మామిడి పండ్లతో పాటు చిరంజీవి అర్ధాంగి సురేఖ వంటలను కూడా పంపించారు. అత్తమ్మాస్ కిచెన్ నుండి ఆవకాయ పచ్చడితో పాటు పులిహోర, ఉప్మా, కేసరి, రసం, పొంగల్ వంటి రెడీ టూ మిక్స్ పొడులను కూడా పంపించారు. చిరంజీవి నుండి వచ్చిన ప్రత్యేక బహుమతి వీడియోను అలీ అర్ధాంగి జుబేదా తన యూట్యూబ్, సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. చిరంజీవి తమపై ఉన్న ప్రేమతో ఇవన్నీ పంపించడం చాలా సంతోషంగా ఉందని జుబేదా అన్నారు.
- June 2, 2025
0
66
Less than a minute
Tags:
You can share this post!
editor

