ఎన్టీఆర్ ‘డ్రాగన్‌’ సినిమా కోసం స్పెషల్ సెట్?

ఎన్టీఆర్ ‘డ్రాగన్‌’ సినిమా కోసం స్పెషల్ సెట్?

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమాపై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్‌డేట్ ప్రకారం జూన్ మూడో వారం నుండి ఓ ప్రత్యేక సెట్‌లో ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట. అందుకోసం ఓ ప్రత్యేక సెట్‌ను కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్‌లో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తారని తెలుస్తోంది. సినిమా మొత్తానికే ఈ సన్నివేశాలు మెయిన్ హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్‌తో పాటు ప్రకాష్‌రాజ్, మిగిలిన నటీనటులు కూడా పాల్గొంటారట. ఇక ఈ సినిమా టైటిల్ ‘డ్రాగన్‌’ అని ప్రచారంలో ఉంది. ఐతే, ‘డ్రాగన్‌’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటివరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లో కల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

editor

Related Articles