కోలీవుడ్ క్రేజీ జంటలలో ధనుష్-ఐశ్వర్య జంట ఒకటి. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరూ ఊహించని కారణాల వలన విడిపోయారు. దాదాపు 18 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత, ధనుష్, ఐశ్వర్య 2022 జనవరి 17న తాము విడిపోతున్నట్లు ప్రకటించి పెద్ద బాంబ్ పేల్చారు. అయితే ఇప్పుడు తమ కొడుకు కోసం వీరిద్దరు జంటగా కనిపించడం అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. ధనుష్ కుమారుడు యాత్ర తన పాఠశాల విద్యను పూర్తిచేశాడు. ఇక పాఠశాలలో జరిగిన స్నాతకోత్సవానికి తన మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్‌తో కలిసి హాజరయ్యారు ధనుష్. ఈ సందర్భంగా తన కొడుకును కౌగిలించుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రౌడ్ పేరెంట్స్ అని రాసుకొచ్చాడు ధనుష్. విడిపోయినా కూడా తమ కొడుకు కోసం వారిద్దరు తిరిగి కలవడం సంతోషంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొడుకు సక్సెస్ చూసి ధనుష్ ఆనందానికి అవధులు దాటిందనే చెప్పాలి.
- June 1, 2025
0
51
Less than a minute
Tags:
You can share this post!
editor

