అఖిల్ పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన నాగార్జున దంపతులు

అఖిల్ పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన నాగార్జున దంపతులు

హీరో సినీ నటుడు నాగార్జున తన సతీమణి అమలతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తన కుమారుడు, హీరో అఖిల్ అక్కినేని వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అందజేశారు. టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీల‌లో ఒక‌టైన అక్కినేని ఇంటా మ‌రోసారి పెళ్లిబాజాలు మోగ‌నున్నాయి. గ‌తేడాది నాగార్జున పెద్ద కొడుకు న‌టుడు నాగ‌చైత‌న్య – శోభితా పెళ్లి జ‌రుగ‌గా.. తాజాగా అత‌డి చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం చేసుకున్న విష‌యం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం జరగ‌గా.. జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే తాజాగా అఖిల్ వెడ్డింగ్ కార్డుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంద‌జేశాడు నాగార్జున. శ‌నివారం ఉద‌యం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన నాగార్జున, అమల దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంత‌రం అఖిల్ వివాహ శుభలేఖను ఆయనకు అందించారు.

editor

Related Articles