తమిళంతో పాటు తెలుగు, హిందీ పరిశ్రమలో తన నటనతో లోకనాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్న కమల్ హాసన్ తన సినీ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే జనరేషన్లో అయినా తనను మించిన నలుగురు నటులు కనిపిస్తే.. తాను నటనకు వీడ్కోలు చెబుతానని ప్రకటించారు. 70 ఏళ్ల వయసున్న ఈ హీరో ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కమల్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా సినిమా థగ్ లైఫ్. మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సింబు, త్రిష కృష్ణన్, అభిరామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న కమల్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకుముందే తనకు ‘రిటైర్మెంట్ అంటే మరణంతో సమానం’ అని చెప్పిన కమల్ తాజాగా మరోసారి ఆ విషయంపై మాట్లాడాడు. ఇప్పుడు ఉన్న జనరేషన్ లేదా వచ్చే జనరేషన్లో అయినా తనను మించిన నలుగురు నటులు కనిపిస్తే.. తాను సినిమాలు వదిలేస్తానని కమల్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
- May 31, 2025
0
102
Less than a minute
Tags:
You can share this post!
editor

