నేడే మిస్ వ‌ర‌ల్డ్ ఫైన‌ల్స్..

నేడే మిస్ వ‌ర‌ల్డ్ ఫైన‌ల్స్..

 హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న మిస్‌ వరల్డ్‌ – 2025 పోటీలు తుది దశకు చేరుకున్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే విజేత ఎవరో తేలనుంది. మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్ కోసం హైదరాబాద్ హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫైనల్ నిర్వహణకు సర్వం సిద్ధం అయినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6-30 గంటలకు కార్యక్రమం ప్రారంభమై 9-20 గంటలకు ముగియ‌నుంద‌ని తెలుస్తోంది.. దాదాపు 3500 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలిగిపోతూ.. ఈ మెగా ఈవెంట్‌కు వేదిక సిద్ధంగా ఉంది. అయితే ఫైనల్స్‌లో ఎవరు కిరీటాన్ని గెలుచుకుంటారో అని ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ గ్రాండ్ ఫినాలే 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ కానుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డి, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈసారి మిస్‌ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌ మనీ లభిస్తుంది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు సుమారు 110 కి పైగా దేశాల నుండి సుందరీమణులు తరలి రాగా, వీరిలో గ్రాండ్ ఫినాలేకు 40 మంది కంటెస్టెంట్లు ఎంపికయ్యారు. వీరిలో నుండి ఒక్కరు మిస్ వరల్డ్ కిరీటం అందుకోనున్నారు.

editor

Related Articles