ఎప్పుడైతే దీపిక ఈ సినిమా నుండి తప్పుకుందో వెంటనే తన సినిమా హీరోయిన్ తృప్తి డిమ్రీ అని సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. ఆ తర్వాత దీపికా విషయంలో బాగా హర్ట్ అయిన సందీప్ తన సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో దీపికా తన సోషల్ మీడియాలో మహిళలపై వివక్ష గురించి వీడియో షేర్ చేసింది. దీపిక పోస్ట్ చేసిన వీడియోను తమన్నా భాటియా లైక్ చేసి మద్దతు తెలిపారు. దీంతో ఈ ఇష్యూ చర్చనీయాంశం అయింది. ఇక దీపిక స్పిరిట్ నుండి తప్పుకోడానికి పలు కారణాలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. `స్పిరిట్` సినిమా కోసం షూటింగ్ 100 రోజులకు మించితే, అదనపు రోజులకు అదనపు పారితోషికం ఇవ్వాలని దీపిక డిమాండ్ చేసినట్లు నెట్టింట ప్రచారం జరిగింది. ఈ షరతులు సందీప్ రెడ్డి వంగాకు ఇబ్బంది కలిగించాయని అన్నారు. అయితే తాజాగా దీపిక ఓ ఇంటర్వ్యూలో స్పిరిట్ నుండి తప్పుకోడానికి గల కారణం చెప్పుకొచ్చింది. రీసెంట్‌గా ఓ డైరెక్టర్ నన్ను కలిసి కథ చెప్పాడు. కథ చాలా బాగా నచ్చింది. కాని మనీ గురించి చర్చ వచ్చినప్పడు ఇంత చార్జ్ చేస్తా అని అన్నాను. దానికి వారు ఒప్పుకోలేదు. అందుకే నేను వారికి టాటా బైబై చెప్పాను. నా ట్రాక్ రికార్డ్ నాకు తెలుసు. అందుకే ఆ సినిమాకి నేను ఒప్పుకోలేదని దీపిక స్పష్టం చేసింది.
- May 31, 2025
0
112
Less than a minute
Tags:
You can share this post!
editor

