తప్పు చేస్తేనే కదా క్షమాపణలు చెప్పడానికి.. కమల్‌ హాసన్‌..

తప్పు చేస్తేనే కదా క్షమాపణలు చెప్పడానికి.. కమల్‌ హాసన్‌..

తమిళం నుండి కన్నడ భాష పుట్టిందంటూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కన్నడ  భాషపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయన బహిరంగ క్షమాపణలు  చెప్పాలనే డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా వివాదంపై కమల్‌ హాసన్‌ స్పందించారు. ఈ విషయంలో క్షమాపణలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. తప్పు చేసి ఉంటేనే క్షమాపణలు చెప్తానని స్పష్టం చేశారు. ‘నేను తప్పు చేస్తే క్షమాపణలు చెప్తాను. లేదంటే చెప్పను. ఇది నా శైలి’ అంటూ చెప్పుకొచ్చారు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం అని తాను చట్టం, న్యాయాన్ని నమ్ముతానని వ్యాఖ్యానించారు.

editor

Related Articles