శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్

శ్రీకాళహస్తీశ్వరుడిని  దర్శించుకున్న  హీరో  శ్రీకాంత్

హీరో శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. వేకువ‌ జామున ఆలయానికి చేరుకున్న శ్రీకాంత్ కుటుంబానికి ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ముందుగా వారు ఆలయానికి సమీపంలో ఉన్న రాఘవేంద్ర మఠంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం, శ్రీ సోమస్కంద మూర్తి సమేత జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం, మృత్యుంజయ స్వామి సన్నిధిలో వేద పండితులు శ్రీకాంత్ కుటుంబానికి వేద ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ అధికారులు స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు, ప్రసాదాలను కూడా బహూకరించారు.

editor

Related Articles