లారెన్స్ ‘బెంజ్’ లోకి హీరోయిన్‌గా సంయుక్త మీనన్?

లారెన్స్ ‘బెంజ్’ లోకి హీరోయిన్‌గా సంయుక్త మీనన్?

పలు రంగాల్లో మంచి టాలెంట్ కలిగిన హీరోల్లో రాఘవ లారెన్స్ కూడా ఒకరు. అలాగే సంగీత దర్శకునిగా ఇంకా డాన్స్ మాస్టర్‌గా ఎన్నో సినిమాలు చేసిన తాను లేటెస్ట్‌గా చేస్తున్న సాలిడ్ చిత్రమే “బెంజ్”. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వస్తున్న నాలుగో సినిమాగా తన కథతో దర్శకుడు బక్కియరాజ్ కణ్ణన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ సంయుక్త మీనన్ లాక్ అయ్యినట్టుగా ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. తెలుగులో భీమ్లా నాయక్‌తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అక్కడ నుండి మంచి సినిమాలు చేస్తూనే బిజీగా ఉంది. ఇక ఈ సాలిడ్ సినిమా కోసం లాక్ చేసినట్టుగా కోలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

editor

Related Articles