నేను 15 తెలుగు సినిమాల్లో నటిస్తే.. అందులో 13 సినిమాలు విజయాలను సాధించాయి. ఆ విజయాలను మీరిచ్చారు. ఫ్లాపులు మాత్రం నేనే ఇచ్చాను. ఇది తీర్చలేని రుణం. ‘థగ్‌లైఫ్’ సినిమాను జూన్ 5న మీకు అందిస్తున్నా. నిజంగా గ్రేట్ ఫిల్మ్ ఇది. నాతోపాటు ఈ సినిమాలోని ప్రతీ ఒక్కరూ అద్భుతమైన పాత్రలు చేశారు. గొప్ప సినిమా చేశామని మేమంతా నమ్ముతున్నాం. మా నమ్మకం నిజమా? కాదా? అనేది మీరే చెప్పాలి.’ అన్నారు కమల్‌హాసన్.. ‘నాయకన్’ వచ్చిన 38 ఏళ్ల విరామం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన సినిమా ‘థగ్‌లైఫ్’. శింబు, త్రిష, అభిరామి, నాజర్ కీలక పాత్రధారులు. కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్, ఉదయ్‌నిధి స్టాలెన్ నిర్మాతలు. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం విశాఖపట్టణంలో భారీగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో అభిమానులను ఉద్దేశించి కమల్‌హాసన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శింబు, త్రిష, నాజర్ సినిమా అధినేత ఎన్.సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- May 30, 2025
0
149
Less than a minute
Tags:
You can share this post!
editor

