కోహ్లీ లైక్ కొట్ట‌డంపై ర‌కుల్ కామెంట్.. మ‌నకు ఇంత కన్నా పనిలేదా..!

కోహ్లీ లైక్ కొట్ట‌డంపై ర‌కుల్ కామెంట్.. మ‌నకు ఇంత కన్నా పనిలేదా..!

సోష‌ల్ మీడియాలో విరాట్ కోహ్లీని ఫాలో అయ్యే వారు చాలా ఎక్కువే. అయితే కోహ్లీ ఇటీవ‌ల ఓ హాట్ బ్యూటీ ఫొటోకి లైక్ కొట్టాడు. దాంతో ఒక్కసారిగా అతని ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లంతా షాక్ అయ్యారు. విరాట్ కోహ్లి ఏంటీ ఈ బ్యూటీ ఫొటోకి లైక్ కొట్టడం ఏంటని అంతా అవాక్కయ్యారు. ఇలా ఎలా జ‌రిగింది అని తెలుసుకునేలోపే ఈ విష‌యం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ ఇటీవల తన గోవా ఫొటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ కింద విరాట్ కోహ్లి లైక్ కనిపించింది. అయితే బోల్డ్ ఫొటోస్‌తో రచ్చ చేసే ఈ బ్యూటీ ఫొటోకి కోహ్లీ లైక్ కొట్ట‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇది పెద్ద ఇష్యూగా మారుతుండటంతో నేరుగా కోహ్లినే స్పందించాల్సి వచ్చింది. నా ఫీడ్ క్లియర్ చేసేటప్పుడు బహుశా అల్గారిథం పొరపాటు వల్ల ఇలా జరిగి ఉండొచ్చు. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదు. అనవసర ఊహాగానాలు చేయొద్దంటూ రిక్వెస్ట్ చేశారు. అర్ధం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని కూడా కోహ్లీ త‌న కామెంట్‌లో తెలియ‌జేశాడు. ఈ ఇష్యూ గురించి తాజాగా ర‌కుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. నటి అవ్‌నీత్ కౌర్ ఫ్యాన్ పేజీలోని ఓ పోస్ట్‌ను విరాట్ కోహ్లీ లైక్ చేయడంతో ఆమెకి ఏకంగా 2 మిలియన్ల మంది ఫాలోయర్లు పెరిగారట.

editor

Related Articles