ఖలేజా సినిమాను ఫ్యాన్స్ చంపేశారు.. నిర్మాత సి కల్యాణ్‌

ఖలేజా సినిమాను ఫ్యాన్స్ చంపేశారు.. నిర్మాత సి కల్యాణ్‌

 బాక్సాఫీస్ వద్ద మహేష్‌బాబు అభిమానులే స్వయంగా ఖలేజా  సినిమాను చంపేశారంటూ షాకింగ్ కామెంట్స్‌ చేశారు సినిమా నిర్మాతల్లో ఒకరైన సి కల్యాణ్‌. మహేష్‌బాబు  అభిమానులు ఇప్పుడు మాత్రం ఆ అభిమానులే బిగ్‌ స్క్రీన్‌పై మరోసారి సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నారు. మహేష్‌బాబు కెరీర్‌లో భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన సినిమాల్లో ఒకటి ఖలేజా. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 30న రీ-రిలీజ్‌ కానుంది. సినిమా విడుదలై చాలా ఏళ్లు అయినప్పటికీ ఈ సినిమాకి సెపరేట్‌ ఫ్యాన్ బేస్‌ ఉంటుంది. రీ-రిలీజ్‌పై ప్రీ సేల్స్‌ అంశంలో సరికొత్త బెంచ్‌మార్క్‌ నమోదు చేసి అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఖలేజా రీ-రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఇటీవల సినిమా నిర్మాతల్లో ఒకరైన సి కల్యాణ్‌ చేసిన బోల్డ్‌ కామెంట్స్‌ ప్రస్తుతం నెట్టంట రౌండప్ చేస్తున్నాయి. 2010లో సినిమా ఒరిజినల్‌ రిలీజ్‌ గురించి ఆయన మాట్లాడుతూ.. బాక్సాఫీస్ వద్ద మహేష్‌బాబు అభిమానులే స్వయంగా సినిమాను చంపేశారంటూ షాకింగ్ కామెంట్స్‌ చేశారు.

editor

Related Articles