ప్రస్తుతం నటుడు రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న సాలిడ్ మాస్ సినిమా “పెద్ది” గురించి అందరికీ తెలిసిందే. అయితే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా గురించి అభిమానులు ఓ రేంజ్‌లో ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తుండగా రామ్ చరణ్ దీనికి ముందే కోలీవుడ్ దర్శకుడు శంకర్‌తో వర్క్ చేసి ఊహించని ఫలితాన్ని అందుకోవాల్సి వచ్చింది. అయితే మన తెలుగు హీరోలకి తమిళ దర్శకులతో సక్సెస్ రేట్ చాలా తక్కువే ఉందని చెప్పాలి. ఇలాంటి సమయంలో కూడా రామ్ చరణ్ మరో తమిళ దర్శకునికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆ దర్శకుడు ఏంటి ఎవరు అనేది ప్రస్తుతానికి బయటకి రాలేదు కానీ చర్చలు అయితే సాగుతున్నాయట. గత కొన్నాళ్ల నుండి లోకేష్ కనగరాజ్‌తో సినిమా అనే బజ్ ఉంది. మరి ఇది తప్ప మరో కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ ఆలోచనలో పడతారు అని చెప్పడంలో సందేహం లేదు.
- May 29, 2025
0
195
Less than a minute
Tags:
You can share this post!
editor


