పవన కళ్యాణ్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా షూటింగ్ నుండి పవన్ కళ్యాణ్ ఫొటోలు, వీడియోలు కూడా లీక్ అయ్యాయి. అయితే పవన్ రాజకీయాల వల్ల ఆగిన ఓజీ సినిమా ఎట్టకేలకు పూర్తవుతుంది అని ఫ్యాన్స్ సంతోషించేలోపే ఓ నటుడి వలన సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలోని ఆరే కాలనీలో ఓజీ కొత్త షెడ్యూల్ మొదలు పెట్టారు. పవన్, ఇమ్రాన్ హష్మీల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్‌కి వచ్చిన ఇమ్రాన్ హష్మీ కాస్త ఇబ్బంది పడ్డారట. అనారోగ్యం బారిన పడినట్లు అర్థం అవుతూ ఉండడంతో మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. దాంతో ఇమ్రాన్‌కి డెంగ్యూ అని తెలిసిందట. అయితే వైద్యులు వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఈ విషయాన్ని ఇమ్రాన్.. సుజీత్, డీవీవీ దానయ్యలకి చెప్పారట. వారు పవన్‌కి ఈ విషయం తెలియజేశారు. ఇమ్రాన్ కోలుకున్న తర్వాతే షూటింగ్ చేద్దాం అని అన్నారట పవన్.
- May 29, 2025
0
73
Less than a minute
Tags:
You can share this post!
editor

