మిస్ అయిన క‌న్న‌ప్ప హార్డ్ డ్రైవ్

మిస్  అయిన  క‌న్న‌ప్ప  హార్డ్  డ్రైవ్

మంచు విష్ణు సినిమా క‌న్న‌ప్ప‌కి ఊహించ‌ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. సినిమాని ఎప్పుడో రిలీజ్ చేయాల‌ని అనుకున్నా కుద‌ర‌క జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో అన్ని ఇండ‌స్ట్రీల‌కి సంబంధించిన స్టార్స్ ఉండ‌డంతో సినిమాపై అంద‌రిలో చాలా ఆస‌క్తి నెల‌కొంది. సినిమాలో విష్ణుతో పాటు, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, విష్ణు కూతుళ్లు  ఇలా చాలామంది స్టార్స్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్.. ఇలా పలు ప్రాంతీయ భాషల్లో కన్నప్ప సినిమాని భారీ ఎత్తున విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం క‌న్న‌ప్ప సినిమా ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానున్న ఈ సినిమా హార్డ్‌డ్రైవ్‌ మిస్‌ అయింది. కన్నప్ప సినిమాకి సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన హార్డ్‌ డ్రైవ్‌ మాయమైనట్లు ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

editor

Related Articles