‘సూర్య’ రోల్‌పై క్రేజీ రూమర్?

‘సూర్య’  రోల్‌పై  క్రేజీ  రూమర్?

తమిళ హీరో సూర్య తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి, సూర్య కోసం బలమైన కథ రాశాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఇప్పుడు ఈ సినిమాపై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సూర్య డ్యూయెల్ రోల్‌లో కనిపించబోతున్నారని.. సూర్య రెండు పాత్రల్లో ఒక పాత్ర నెగిటివ్, మరో పాత్ర పాజిటివ్ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. అన్నట్టు ఇప్పటికే, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సూర్య సినిమాకు వెంకీతో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు హీరోయిన్‌గా భాగ్యశ్రీ భోర్సేను తీసుకునే ప్లాన్‌లో ఉన్నారని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ ప్లేస్‌లోకి గ్లామరస్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారని టాక్ నడిచింది. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్‌లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

editor

Related Articles