బాలకృష్ణతో కొత్త సినిమా మళ్లీ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో?

బాలకృష్ణతో కొత్త సినిమా మళ్లీ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో?

బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలతో వరుస హిట్లు అందుకుని ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ‘అఖండ-2’ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు, గోపీచంద్ మలినేని, బాలయ్యతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే, గోపీచంద్, బాలయ్యకు కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కథ కూడా బాలయ్యకు నచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఎలాగూ, జూన్ 10న బాలయ్య బర్త్ డే ఉంది. కాబట్టి, ఆ రోజు ఈ సినిమాని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గోపీచంద్ రీసెంట్‌గా సన్నీ డియోల్‌తో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ‘అఖండ 2’ తర్వాత బాలయ్య బాబు సినిమా ఉండే అవకాశం ఉంది. ఇక బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న అఖండ 2 షూటింగ్ ప్రస్తుతం జార్జియా దేశంలో షూటింగ్ నడుస్తోంది.

editor

Related Articles