హీరో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్కువగా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అయితే రాజకీయాలతో బిజీగా ఉండడం వలన గతంలో మాదిరిగా ఇప్పుడు పవన్ సినిమాలు చేసే పరిస్థితి లేదు. కాకపోతే గతంలో ఆయన ఒప్పుకున్న ప్రాజెక్ట్‌లని ఇప్పుడు శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. అందులో భాగంగానే హరి హర వీర మల్లు సినిమా షూటింగ్‌ను పూర్తి చేయగా, ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక దీని తర్వాత ఓజీని పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్. ఇటీవల షూటింగ్ మళ్లీ మొదలు పెట్టినట్లు చిత్ర బృందం కూడా ప్రకటించింది. సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్నట్టు తెలుస్తుండగా, వీలైనంత త్వరగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను సెప్టెంబర్ 25న దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. జూన్ 12న హరిహర వీరమల్లుతో పవన్ పలకరించనుండగా, షార్ట్ గ్యాప్‌తో ఓజీతో రచ్చ చేయనున్నాడు.

- May 26, 2025
0
136
Less than a minute
Tags:
You can share this post!
editor