లైవ్‌లో శింబుతో ఫోన్‌కాల్ మాట్లాడిన మ‌నోజ్

లైవ్‌లో శింబుతో ఫోన్‌కాల్ మాట్లాడిన మ‌నోజ్

మంచు మ‌నోజ్ కొద్ది రోజుల క్రితం వాళ్లింట్లో జరిగిన ప‌లు కొట్లాటలతో హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడు మే 30న రాబోతున్న భైర‌వం సినిమా ప్ర‌మోష‌న్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటూ రచ్చ‌ర‌చ్చ చేస్తున్నారు. గ‌త రాత్రి భైర‌వం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో శింబు ఫోన్ నెంబ‌ర్ లీక్ చేశాడు మ‌నోజ్. ముందుగా మనోజ్‌ లైవ్ లోనే తమిళ స్టార్ హీరో శింబుకి కాల్ చేశాడు. మనోజ్ ఫోన్‌లో వాయిస్ స‌రిగ్గా వినిపించ‌క‌పోవ‌డంతో.. ప‌క్క‌నే ఉన్న హీరోయిన్ అదితి శంక‌ర్ ఫోన్ తీసుకుని కాల్ చేశాడు. ఇక అప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య స‌ర‌దా సంభాష‌ణ జ‌రిగింది. కమల్ హాసన్ సార్‌తో నటించావు.. నిన్ను చూస్తే జలసీగా ఉంది.. థ‌గ్‌ లైఫ్‌కు ఆల్ ది బెస్ట్ మచ్చా.. అని మనోజ్ అన‌డంతో అందుకు శింబు థ్యాంక్స్  అని చెప్పారు. ఇక చివ‌ర‌లో మనోజ్ గురించి ఒక విషయం చెప్పాలి. మనోజ్ చిన్నపిల్లాడి లాంటివాడు. మనం ప్రేమిస్తే తిరిగి అంతకుమించిన ప్రేమను చూపిస్తాడు. అదే ద్వేషిస్తే అతనితో మనకే రిస్క్ అని అన్నాడు. అందుకే మనోజ్‌ను ఎక్కువగా ప్రేమించాలి.. మనోజ్ లాంటి ఫ్రెండ్‌ను నాకు దొరకడం నా అదృష్టం అంటూ శింబు అన్నాడు.

editor

Related Articles