కమల్ కూతురు శ్రుతిహాసన్ మల్టీ టాలెంటెడ్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆమె నటిగానే కాదు గాయనిగా కూడా అలరిస్తూ ఉంటుంది. సినిమాలలో నటిస్తూ సమయం దొరికినప్పుడల్లా శ్రుతిహాసన్ పాటలు పాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు స్వయంగా మ్యూజిక్ కంపోజ్ కూడా చేస్తుంది. అయితే శ్రుతిహాసన్ తన తండ్రి నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా కోసం ‘విన్వేలి నాయకన్’ అంటూ సాగే పాటను స్టేజ్‌పై పాడి అదరగొట్టింది. ఆడియో లాంచ్ ఈవెంట్‌లో శ్రుతిహాసన్ లైవ్ పర్ఫార్మెన్స్ చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. తన తండ్రి ముందు శ్రుతిహాసన్ అదిరిపోయే పర్‌ఫార్మెన్స్ ఇవ్వడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. శ్రుతిహాసన్ తన పాటతో అందర్నీ ఉర్రూతలూగించేలా చేసింది. శ్రుతిహాసన్ పాట పాడిన వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేయగా, ఇప్పుడు ఈ వీడియో తెగ హల్‌చల్ చేస్తుంది. 2009లో కమల్ హాసన్ నటించిన ‘ఈనాడు’ సినిమాకి శ్రుతిహాసన్ సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే. ఇందులో రీమిక్స్‌తో కలిపి ఐదు పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేయగా, అందులో మూడు పాటలను తనే స్వయంగా పాడింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత మళ్ళీ తన తండ్రి కోసం గళం విప్పిన ఈ ముద్దుగుమ్మ ‘విన్వేలి నాయకన్’ అంటూ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేసింది.

- May 26, 2025
0
181
Less than a minute
You can share this post!
editor