ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే ‘ఓజీ’ న్యూస్..

ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే ‘ఓజీ’ న్యూస్..

 ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌ప్పుడు హీరోగా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎప్పుడైతే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడో అప్పుడు సినిమాలు చేయ‌డం త‌గ్గించాడు. ఆయ‌న క‌మిటైన ప్రాజెక్టుల‌ని కూడా ప‌క్క‌న పెట్టేశాడు. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు అందుకున్న త‌ర్వాత నుండి ప‌వన్ ప్రజ‌ల‌లోనే ఎక్కువ‌గా ఉంటున్నాడు. దీని వ‌ల‌న ఆయ‌నకి సినిమా షూటింగ్ చేసే స‌మ‌యం దొర‌క‌డం లేదు. ఇక రీసెంట్‌గా కాస్త టైం గ్యాప్ చూసుకొని హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్ర షూటింగ్ పూర్తి చేశాడు. ఈ సినిమా జూన్ 12న విడుద‌ల కానుంది. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెర‌కెక్క‌గా, ఈ సినిమాతో ప‌వ‌న్ ప‌లు రికార్డ్స్ కొల్ల‌గొడ‌తాడని చ‌ర్చించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ప‌వ‌న్ ఖాతాలో ఉన్న మ‌రో సినిమా ఓజి. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్‌గా జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ షర్ట్ లెస్ ఫైట్ చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓజీ సినిమాలో సుజిత్ ఓ అదిరిపోయే ఫైట్ సీన్‌ను ప్లాన్ చేశార‌ని. ఆ ఫైట్‌లో పవన్ షర్ట్ లేకుండా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది.

editor

Related Articles