‘జైలర్ 2’లో కాంట్రవర్సియల్ నటుడు మళ్ళీ?

‘జైలర్ 2’లో కాంట్రవర్సియల్ నటుడు మళ్ళీ?

రజినీకాంత్ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన హిట్ సినిమా “జైలర్” కూడా ఒకటి. తమిళ్ లోనే కాకుండా తెలుగు మార్కెట్ సహా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా రికార్డు వసూళ్లు అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ ఇపుడు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ జైలర్ 2 లో మరింతమంది స్టార్ కాస్ట్ నటిస్తుండగా వీరితో పాటుగా పార్ట్ 1 లో కనిపించిన ప్రముఖ నటుడు వినాయకన్ కూడా ఉంటాడని తెలుస్తోంది. పార్ట్ 1 లో విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్న వినాయకన్ పార్ట్ 2 మొదలయ్యేలోపే ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఈ నటుడు కేవలం 2 రోజుల షూటింగ్‌లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.

editor

Related Articles