యదార్థ సంఘటల ఆధారంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ కోర్ట్ డ్రామా ‘గుర్తింపు’. కేజేఆర్ హీరో. తెన్‌పతియాన్ దర్శకుడు. స్వస్తిక్ విజన్స్ సమర్పణలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. 85 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత మహేశ్వర్‌రెడ్డి మూలి మాట్లాడుతూ ‘పేదరికంలో ఉన్న ఓ వ్యక్తి.. తన కలల్ని నెరవేర్చుకునేందుకు క్రీడారంగంలో ఎదిగిన తీరు, గుర్తింపు కోసం చేసిన ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ‘గుర్తింపు’. నిర్మాతగా మేం అనువదించిన శివకార్తికేయన్ ‘వరుణ్ డాక్టర్’ మంచి విజయాన్ని సాధించింది అని మీకు తెలుసు.

- May 24, 2025
0
55
Less than a minute
Tags:
You can share this post!
editor