కొంత కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలకి, ఎగ్జిబిటర్స్‌కి అస్సలు పడడం లేదు. పర్సంటేజ్ సిస్టమ్‌లో సినిమాలు రిలీజ్ చేయాలని ఎగ్జిబిటర్స్ అంటుంటే, అలా చేస్తే మాకు తీరని నష్టం వస్తుందని నిర్మాతలు అంటున్నారు. ఈ క్రమంలో జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి చర్చించేందుకు ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన సంయుక్త రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ మీటింగ్‌కు దాదాపు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. వారిలో సురేష్ బాబు, దిల్ రాజు లాంటి నిర్మాతలు కూడా ఉన్నారు. మీటింగ్‌లో తమ సమస్యలని విన్నవించుకున్నారు ఎగ్జిబిటర్లు. అయితే అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపే పరిస్థితుల్లో తాము లేమని థియేటర్ యాజమాన్యం అంటోంది. అలా చేస్తే నష్టాలు వస్తున్నాయని.. సినిమా నిర్మాతలు సహకరించి పర్సంటేజ్ విధానానికి అంగీకరించాలని వారు కోరారు. దీనిపై ఈ రోజు కూడా చర్చ జరగనుంది. అయితే బంద్ నిర్ణయం వెనుక కుట్ర ఉందని జనసేన ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 న విడుదల నేపద్యంలో ఆ నలుగురు కుట్ర చేశారంటూ తీవ్రంగా ఆరోపిస్తోంది జనసేన. అంతే కాదు దీనిపై ఏకంగా విచారణకు ఆదేశించారు సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్. థియేటర్లు మూసివేయాలనే ఒత్తిడి వెనుక దాగున్న కుట్రను వెలికి తీయాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్‌కు మంత్రి కందుల దుర్గేష్ ఫిర్యాదు చేశారు. అయితే తెలుగులో అగ్ర నిర్మాతలుగా పేరున్న ఆ నలుగురు ఇటీవల ఒక చోట సమావేశం అయ్యారని, వారు పన్నిన కుట్రలో భాగమే థియేటర్ల మూసివేత అంటూ ఫిర్యాదులో రాసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ నలుగురు ఎవరనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.

- May 24, 2025
0
64
Less than a minute
Tags:
You can share this post!
editor