టాలీవుడ్ సినీ ప్రేక్షకులు తమ అభిమాన హీరోల వారసులు ఎప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు కొడుకు గౌతమ్, పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అదుగో ఇదుగో అంటున్నారే తప్ప క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కొడుకు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు అనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఎన్టీఆర్ రెండు దశాబ్ధాల కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదిగి నేడు గ్లోబల్ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. వార్ 2తో ఇప్పుడు బాలీవుడ్‌లోకి డైరెక్ట్‌గా అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా హిందీ ప్రేక్షకులకి మంచి ట్రీట్ అందించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ క్రేజీ యాక్షన్ సినిమా కోసం ఎన్టీఆర్ స్లిమ్ లుక్‌లో మారాడు.

- May 22, 2025
0
58
Less than a minute
Tags:
You can share this post!
editor