హీరో కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కలిసి ఓ సినిమా చేశారు. ‘థగ్ లైఫ్’ సినిమాతో వీరిద్దరు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌పై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను దర్శకుడు మణిరత్నం పంచుకున్నారు. ఈ సినిమాకి చాలా టైటిల్స్ పరిశీలించామని, అయితే ‘థగ్ లైఫ్’ అనే టైటిల్‌ని కమల్ స్వయంగా ప్రకటించారని.. ఈ టైటిల్ అందరికీ నచ్చడంతో దీన్నే ఫిక్స్ చేశామని ఆయన తెలిపారు. ఈ సినిమాలో శింబు, త్రిష, అశోక్ సెల్వన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 5న గ్రాండ్ రిలీజ్ కానుంది.
- May 22, 2025
0
54
Less than a minute
Tags:
You can share this post!
editor

