నాగ చైత‌న్య ‘షోయూ’ రెస్టారెంట్ ఫుడ్‌లో బొద్దింక..

నాగ చైత‌న్య ‘షోయూ’ రెస్టారెంట్ ఫుడ్‌లో బొద్దింక..

టాలీవుడ్ హీరో నాగ చైతన్య హైదరాబాద్‌లో ‘షోయూ’  అనే పేరుతో ఒక ప్రీమియం క్లౌడ్ కిచెన్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇది పాన్-ఏషియన్ వంటకాల‌ను స‌ర్వ్ చేస్తుంది. ఈ రెస్టారెంట్ లాక్‌డౌన్ సమయంలో ఆలోచనగా మొదలై, రుచికరమైన ఆహారాన్ని అందించడం దీని ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. రీసెంట్‌గా ఇందులో ఫుడ్ బాగుందంటూ ఎన్టీఆర్ కూడా ప్ర‌శసించాడు. ఇదిలావుంటే తాజాగా ఈ రెస్టారెంట్ నుండి ఆర్డ‌ర్ చేసిన ఫుడ్‌లో బొద్దింక రావ‌డం క‌ల‌క‌లం రేపింది. ఒక నెటిజ‌న్ ఎక్స్ వేదిక‌గా ఈ విష‌యాన్ని పోస్ట్ చేశాడు. తాను షోయూ నుండి ఫుడ్ ఆర్డ‌ర్ చేసుకుంటే అందులో బొద్దింక క‌నిపించింద‌ని పోస్ట్‌తో పాటు ఫొటోను జ‌త చేశాడు. దీనికి సంబంధించి ‘షోయూ’ టీమ్‌కి కంప్ల‌యింట్ చేస్తూ.. కాగా ఈ వివాదంపై షోయూ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

editor

Related Articles