హీరో చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ‘అంజి’ తర్వాత చిరు నుండి రాబోతున్న ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆ మధ్య టీజర్ విడుదల కాగా, దానిపై కాస్త నెగెటివ్ టాక్ వచ్చింది. అందుకే సినిమాపై ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. దసరా వరకు సినిమాని రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమాని గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘విశ్వంభర’ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు చిత్ర నిర్మాత విక్రమ్ కుమార్. ఈ సినిమాకు సంబంధించిన ఎపిక్ రివీల్‌ను ఆయన కేన్స్ స్టేజీపై చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై కనిపించడంతో ఒక్కసారిగా ‘విశ్వంభర’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో సౌండ్ చేస్తుంది.
- May 22, 2025
0
52
Less than a minute
Tags:
You can share this post!
editor

