Movie Muzz

ఇస్మార్ట్‌ హీరోయిన్ నిధి అగర్వాల్‌ టైం వచ్చేసింది

ఇస్మార్ట్‌ హీరోయిన్ నిధి అగర్వాల్‌ టైం వచ్చేసింది

పవన్‌ కళ్యాణ్ నటిస్తోన్న హరిహరవీరమల్లు .. ప్రభాస్‌ టైటిల్ రోల్‌ పోషిస్తున్న రాజాసాబ్‌. ఈ రెండు సినిమాలపై పూర్తి ఆశలు పెట్టుకున్న నిధి అగర్వాల్‌కు వరుస వాయిదాలు నిరాశనే మిగులుస్తూ వస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్టందుకుంది నిధి అగర్వాల్‌. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఒకటి పవన్‌ కళ్యాణ్ నటిస్తోన్న హరిహరవీరమల్లు కాగా.. మరోవైపు ప్రభాస్‌ టైటిల్ రోల్‌ పోషిస్తున్న రాజాసాబ్‌. ముందుగా అనుకున్న షెడ్యూల్స్‌ ప్రకారం ఈ సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇక ఈ రెండు సినిమాలపై పూర్తి ఆశలు పెట్టుకున్న నిధి అగర్వాల్‌కు వరుస వాయిదాలు నిరాశనే మిగులుస్తూ వస్తున్నాయి. హరిహరవీరమల్లు రీషెడ్యూల్‌ చేయడంతో నిధి అగర్వాల్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. ఫైనల్‌గా నిధి అగర్వాల్‌ సినిమా ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. మే 21న కొత్త పాట లాంచ్‌తో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

editor

Related Articles